Site icon NTV Telugu

AP Cabinet Meeting: కీలక అజెండాతో కేబినెట్‌ భేటీ.. ముగ్గురు మంత్రులు డుమ్మా..!

Cbn

Cbn

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం అయ్యింది.. మొత్తం 31 అంశాలతో ఏపీ కేబినెట్‌ భేటీ అయ్యింది.. ఈ సమావేశంలో రాజధాని అమరావతి చట్టబద్ధతపై ప్రత్యేక చర్చ సాగుతోంది.. విభజన చట్టంలో రాజధాని అనే అంశం దగ్గర అమరావతి అని ఉండేలా కసరత్తు చేస్తోంది కూటమి సర్కార్‌.. దీనిపై కేబినెట్‌లో చర్చించి కేంద్రానికి పంపే ఆలోచనలో ఉంది.. అయితే, ఈ రోజు ఏపీ కేబినెట్‌కు ముగ్గురు మంత్రులు దూరంగా ఉన్నారు.. ముందుగా నిర్ణయించిన ప్రకారం వివిధ కార్యక్రమాల్లో ఉండడం వల్ల మంత్రులు నారా లోకేష్‌, సత్యకుమార్‌ యాదవ్, పయ్యావుల కేశవ్‌.. ఈ రోజు కేబినెట్‌ సమావేశానికి హాజరుకాలేదు..

Read Also: MP Priti Patel: ‘‘పాకిస్తాన్‌‌పై దాడి చేసే హక్కు భారత్‌కి ఉంది’’.. బ్రిటీష్ ఎంపీ మద్దతు..

తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్నందున.. కేబినెట్‌ భేటీకి దూరంగా ఉన్నారు నారా లోకేష్‌.. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీకి భూమి పూజ చేశారు మంత్రి నారా లోకేష్.. రూ.5,001 కోట్ల పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది.. దీని ద్వారా 2 వేల మంది వరకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రానుండగా.. మరో రూ.839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లు ఏర్పాటు చేయనుంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌.. మరోవైపు.. విదేశీ పర్యటనలో ఉన్నందున మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌.. కేబినెట్‌ భేటీకి హాజరుకాలేకపోయారు.. ఇక, సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉరవకొండలో పర్యటించనున్న నేపథ్యంలో.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఇవాళ్టి కేబినెట్‌ భేటీకి దూరంగా ఉన్నారు..

Exit mobile version