NTV Telugu Site icon

Cabinet Committees: ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం కేబినెట్ కమిటీలు..

Cm

Cm

రాష్ట్ర మంత్రులు చైర్మన్లుగా మూడు కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం మూడు కేబినెట్ కమిటీల ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా.. ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. నారా లోకేష్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ఐదుగురు మంత్రులతో మరొక ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

CM Chandrababu: ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

గంజాయిని అరికట్టేందుకు రవికృష్ణ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం పని చేస్తుంది.. గంజాయి డి అడిక్షన్ సెంటర్లు కూడా పెడతామని సీఎం తెలిపారు. అలాగే.. టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాలు పెంచుతామన్నారు. గంజాయి వాడే వాళ్లను, మాదక ద్రవ్యాలు వాడే వారిని సంఘద్రోహులుగా ప్రకటిస్తామని చెప్పారు. గంజాయి పండించడం గాని, సరఫరా చేయటం గాని.. వాడటం గానీ ఈ రాష్ట్రంలో జరగకూడదని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం పెట్టిన పాలసీలు, సూచనలు సొంత పార్టీ వారు అయినా.. ప్రతిపక్షం వారైనా తప్పకుండా పాటించాలన్నారు. ధరల స్థిరీకరణ కోసం, మంత్రి నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసామని సీఎం తెలిపారు.

Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లోకి వరద.. కంటెస్టెంట్స్ ని ఏం చేస్తారు?