NTV Telugu Site icon

AP MLC Elections 2024: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. నేడు నామినేషన్‌ వేయనున్న ఆ ఇద్దరు

C Ramachandraiah And Haripr

C Ramachandraiah And Haripr

AP MLC Elections 2024: ఆంధ్రప్రదేశ్‌.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు కూటమి నేతలు.. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఈ కాంబినేషన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది.. చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రయార్టీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జనసేన నుంచి అభ్యర్థి ఫైనల్ అవుతారని ఎవ్వరూ ఊహించ లేదంటున్నాయి కూటమి వర్గాలు. భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టుల్లోనూ జనసేన, బీజేపీలకు ప్రయార్టీ ఖాయమని సంకేతాలు ఇచ్చారు.. బలిజ – కాపు కాంబినేషన్‌తో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేశారు.. అంతేకాదు.. కడపపై మరింత ఫోకస్ పెట్టింది టీడీపీ.. బలిజ సామాజిక వర్గం పెద్దగా గుర్తింపుఉన్న సీనియర్‌ లీడర్‌ సి రామచంద్రయ్యను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు చంద్రబాబు.. మరోవైపు.. గత కొన్నేళ్లుగా జనసేనలో కీలకంగా వ్యవహరిస్తోన్న కాపు సామాజిక వర్గానికి చెందిన హరి ప్రసాద్‌కు అవకాశం కల్పించారు.. దీంతో.. శాసన మండలిలోనూ జనసేనకు ప్రాతినిధ్యం లభించబోతోంది.. శాసన మండలిలో జనసేన తొలి సభ్యుడిగా హరి ప్రసాద్ అడుగుపెట్టబోతున్నారు.

Read Also: CM Chandrababu: రహదారులపై ఫోకస్‌.. నేడు రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులతో సీఎం సమీక్ష

ఇక, నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సి.రామచంద్రయ్య, హరిప్రసాద్‌.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ దాఖలకు నేడు చివరి రోజు కాగా.. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది.. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్.. అయితే, వారిలో సి.రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన తెలుగుదేశం. మరో స్థానo జనసేనకు కేటాయించింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ కు అవకాశం ఇచ్చారు.. శాసనసభలో కూటమికి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా.. సి.రామచంద్రయ్య, హరిప్రసాద్‌ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

Show comments