Buddha Venkanna: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.. ఐదు స్థానాలను ఎన్నికలు జరగనుండగా.. జనసేన, బీజేపీకి తలో సీటు కేటాయించి.. మిగతా మూడు స్థానాలకు కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడు పేర్లను ఖరారు చేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా.. కాసేపటి క్రితమే సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది బీజేపీ.. అయితే, గత ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన బుద్దా వెంకన్నకు సర్దుబాట్లలో భాగంగా సీటు దక్కలేదు.. కానీ, ఈ సారి ఎమ్మెల్సీ సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆయనకు అది సాధ్యం కాలేదు.. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తనకు రాకపోవటంపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Dream : భయపెట్టే కలలు ఎందుకొస్తాయి తెలుసా..?
చంద్రబాబు నాయుడు నాకు దేవుడు.. నేను ఆయన భక్తుడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బుద్దా వెంకన్న.. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడు.. కానీ, నాకు పదవి వచ్చినా.. రాకపోయినా.. అంకిత భావంతో పనిచేస్తాను అని స్పష్టం చేశారు.. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడగా అభివర్ణించిన ఆయన.. ఒక్కోసారి పదవి వస్తుంది.. ఒక్కోసారి రాదు.. ఏ సందర్భంలో నైనా నేను ఒకేలా ఉంటాను అని పేర్కొన్నారు.. నాకు పదవి రాకపోయినా బాధ పడను అని వ్యాఖ్యానించారు.. ఇక, అనేక ఈక్వేషన్స్ తో ఎమ్మెల్సీల ఎన్నిక జరిగిందన్నారు.. కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇవ్వటం సరైందే అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..