NTV Telugu Site icon

Subramanian Swamy: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక.. హైకోర్టులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి పిల్..

Ap High Court

Ap High Court

Subramanian Swamy: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో హింస జరిగిందంటూ ఏపీ హైకోర్టులో పిల్ వేసిన బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టడం దాడులు చేశారు.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని నేను పిల్ వేశాను.. నేను వేసిన పిల్ మార్చి-12కు విచారణకు వస్తుందని.. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారు.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది. మంచి విషయం ఎప్పుడు ఎవరు మాట్లాడినా పార్టీలకు అతీతంగా దానిని అంగీకరించాలి.. నేను తీసుకునే నిర్ణయాలపై నా పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని అన్నారు.

Read Also: Mimoh Chakraborty : టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మిథున్ చక్రవర్తి కొడుకు

ఇక, అసెంబ్లీలో తక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ప్రతిపక్షహోదా ఇవ్వాలి అని డిమాండ్‌ చేశారు సుబ్రహ్మణ్యస్వామి.. ప్రతిపక్షంలో ఒక్కటే పార్టీ ఉంది కాబట్టి ప్రతిపక్షహోదా ఇవ్వడంలో తప్పులేదని పేర్కొన్నారు.. మరోవైపు, తిరుపతి లడ్డూ అంశం ముగిసిపోయింది.. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిందన్నారు.. తిరుపతి లడ్డూ గురించి అబద్ధాలు ప్రచారం చేయడం కూడా పెద్ద తప్పే అవుతుందన్నారు.. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరని తెలిపారు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి..