Site icon NTV Telugu

Banakacherla Project: ఏపీకి షాకిచ్చిన కేంద్రం..! బనకచర్ల ప్రాజెక్ట్‎ ప్రతిపాదనలను వెనక్కి ..

Banakacherla Project

Banakacherla Project

Banakacherla Project: ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది.. ఎలాగైనా బనకచర్లను అడ్డుకుంటామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. మిగులు జలాలనేకదా? మేం వాడుకునేది.. అభ్యంతరాలు ఎందుకంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది.. అయితే, దీనిపై కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిక కేంద్ర సర్కార్‌ షాక్‌ ఇచ్చింది.. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది కేంద్రం.. పర్యావరణ అనుమతులు తిరస్కరించింది.. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సీడబ్ల్యూసీ పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.. గోదావరి నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డ్ లు దీని పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది.. ఈ ప్రాజెక్టుపై అనేక విధాలుగా ఫిర్యాదులు వచ్చయన్న కమిటీ.. గోదావరి నది జాలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించినట్లు అవుతుందని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలిపింది కమిటీ..

Exit mobile version