Site icon NTV Telugu

Perni Nani: పేర్ని నానికి హైకోర్టులో ఊరట..

Perni Nani

Perni Nani

Perni Nani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి కోర్టులో ఊరట లభించింది.. ఈ నెల 31వ తేదీ వరకు పేర్ని నానిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు పొడిగించింది.. కాగా, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.. దీంతో, ముందస్తు రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు నాని.. మరోవైపు, ఈ రోజు కేసు రీచ్ కాక పోవడంతో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు పేర్ని నాని తరపు న్యాయవాదులు.. దీంతో, కేసు తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు పేర్కొంది.. దీంతో, హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి మరోసారి ఏపీ హైకోర్టులో ఊరట దక్కినట్టు అయ్యింది..

Read Also: IND vs ENG: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 ఆలౌట్‌.. గాయంతోనే హాఫ్ సెంచరీ చేసిన రిషబ్‌ పంత్‌

Exit mobile version