Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నాను గనుక మాట్లాడకూడదు అంటే కుదరదంటున్నారు. గత ఐదేళ్లు కార్య కర్తలను ఇబ్బంది పెట్టినవాళ్లను కూటమి పార్టీలు చేర్చుకోవద్దని హితవు పలికారు.. ఇక, గంజాయి వల్ల జరిగే అనర్ధాలు, యువత ఎదుర్కోంటున్న ఇబ్బందులు చాలా తీవ్రంగా వున్నాయని అన్నారు. గంజాయి కేసుల కోసం అయితే తన ఇంటి గుమ్మం కూడా ఎక్కొద్దని స్పష్టం చేశారు.. ఇక, అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
Read Also: Canada: భారత్‌తో చెలగాటమాడిన కెనడా పరిస్థితి ఆగమాగం.. అమెరికా సాయం చేస్తుందా?
కాగా, ఈ మధ్యే దొంగ పెన్షన్లపై ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. రాష్ట్రంలో మూడు లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలిందన్న ఆయన.. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బట్టబయలు అయ్యిందన్నారు.. ప్రతినెల ఒక్కొక్కరికి పెన్షన్ రూపంలో 4 వేలు రూపాయలను మంజూరు చేస్తున్నారు.. దొంగ పెన్షన్లు కారణంగా నెలకు పెన్షన్లు రూపంలో 120 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని.. అంటే ఏడాదికి 1,440 కోట్లు, ఐదేళ్లకు 7,200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగిందని పేర్కొన్న విషయం విదితమే.. దొంగ పెన్షన్ తీసుకుంటున్న వారందరూ… దొంగలే అని అంటాను.. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను.. చూద్దాం అని అన్నారు. ఇక్కడ చెప్పొచ్చో లేదో అంటూనే.. ఎవరేమనుకున్నా లెక్క చేయనంటూ తన పాత తరహా పందాలోనే నా స్టైలే వేరు అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రసంగించిన విషయం విదితమే..