NTV Telugu Site icon

Art of Living Ravi Shankar meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ భేటీ.. గొప్ప మార్గం చూపారు..

Art Of Living Ravi Shankar

Art Of Living Ravi Shankar

Art of Living Ravi Shankar meets Pawan Kalyan: ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామన్నారు.. ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని… అలాంటి యోగ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.

Read Also: Udaya Shankar: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ హఠాన్మరణం

ఇక, ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని, అలాంటి ప్రక్రియను పరోక్షంగా నాకు ఉపదేశించిన గురువు శ్రీశ్రీ రవిశంకర్ అని అన్నారు పవన్‌ కల్యాణ్‌.. వారు ఆశీర్వాదాలు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.. ఆయనను సాదరంగా స్వాగతం పలికి.. శాలువాతో సత్కరించారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, పవన్ కళ్యాణ్ ని సత్కరించి ఆశీర్వదించారు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే నాలుగు నైపుణ్యాలు చాలా అవసరం. ఆత్మ బలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుంది. పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు. సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుందన్నారు శ్రీశ్రీ రవిశంకర్‌..

Read Also: Salt: ఒక రోజులో ఎంత ఉప్పు తీసుకోవాలి..? నెల రోజులు ఉప్పు తినడం మానేస్తే ఏమౌతుంది

మరోవైపు.. విజయవాడ పర్యటనలో ఉన్న శ్రీశ్రీ రవిశంకర్.. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.. దర్శనానంతరం వేదాశీర్వచనం చేశారు వేదపండితులు.. రవిశంకర్ గురూజీ కి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు అర్చకులు, ఆలయ అధికారులు..