Site icon NTV Telugu

AP Govt: ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తి.. రేపు భారీ బహిరంగ సభ..!

Ap Govt

Ap Govt

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సర్కార్ ఏర్పాటై రేపటికి ఏడాది పూర్తి అవుతుంది. స్వపరిపాలన – స్వర్ణాంధ్ర ప్రదేశ్ పేరుతో అమరావతిలో రాష్ట్ర స్థాయి సభ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి. అమరావతిలో రేపు సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ సచివాలయం వెనక సభ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు.

Read Also: Trump: ట్రంప్, జేడీవాన్స్, మస్క్‌ను చంపేస్తాం.. అల్‌ఖైదా హెచ్చరిక

అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పకుండా హాజరు కావాలని రాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేయనున్నారు. మరోవైపు, సభ జరిగే ప్రాంతంలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం పూర్తిగా తడిసి పోయింది. దీంతో వేదిక మార్చాలా.. సచివాలయం వెనక ప్రాంతంలోనే సభా ఏర్పాట్లు చేయ్యాలా అనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

Exit mobile version