NTV Telugu Site icon

APPSC vs AP Government: గ్రూప్‌-2 మెయిన్స్‌పై గందరగోళం..! స్పందించని ఏపీపీఎస్సీ.. సీఎం అసంతృప్తి..!

Appsc Vs Cm

Appsc Vs Cm

APPSC vs AP Government: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. గ్రూప్ 2 మెయిన్స్ పై వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలను పూర్తిగా పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకుని పరీక్ష వాయిదాపై APPSCకి లేఖ రాసింది.. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ సరికాదన్న అభ్యర్థుల వాదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం.. రోస్టర్ సమస్యను, అభ్యర్ధుల న్యాయబద్దమైన విన్నపాలను వివరిస్తూ పరీక్ష వాయిదా కోరుతూ ప్రభుత్వం లేఖ రాసింది.. అయితే నిన్ననే లేఖ రాసినా ప్రభుత్వ అభ్యర్థనపై ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ వర్గాలు స్పందించలేదు.. ప్రభుత్వ లేఖను APPSC పట్టించుకోకపోవడంపై అభ్యర్ధులు విస్మయంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Read Also: Prabhas : ప్రభాస్ కోసం రంగంలోకి హాలీవుడ్ యాక్టర్..ఇక మామూలుగా ఉండదు

ఇక, లక్ష మంది ఆందోళనను ఏపీపీఎస్సీ పెద్దలు అర్థం చేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రభుత్వ లేఖపై ఇంతవరకు ఏపీపీఎస్సీ స్పందించకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది.. అభ్యర్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఏపీపీఎస్సీ త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటించాలంటున్నారు గ్రూప్ 2 అభ్యర్థులు.. ప్రభుత్వం స్పందించినా.. ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం ప్రకటించకపోవడం పట్ల అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. గ్రూప్-2 మెయిన్స్‌పై ఏపీపీఎస్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. రోస్టర్‌ తప్పులను సరిదిద్ది గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని సూచిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు..