Site icon NTV Telugu

APPSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీపీఎస్సీ..

Appsc

Appsc

APPSC: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టింది.. ఓవైపు ప్రైవేట్‌ సెక్టార్‌లో పెట్టుబడులు ఆకర్షించి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.. మరోవైపు, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ఫోకస్‌ పెట్టింది.. ఇప్పటికే మెగా డీఎస్సీపై ముందడుగు వేసిన ప్రభుత్వం.. ఇతర శాఖల్లోనూ ఖాళీలు పూర్తి చేస్తోంది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. అటవీ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.. ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇచ్చింది.. ఇక, ఏపీపీఎస్సీ.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం.. https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు..

Read Also: AP and Telangana Water War: ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ.. ఎల్లుండి సీఎంల భేటీ..

Exit mobile version