Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఎవరికి ఏ జిల్లాలో పదవులు కేటాయించాలనే అంశంపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు కూటమి నేతలు తెరదించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించి జిల్లాల వారీగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో బుధ, గురువారాల్లో జరిగిన చర్చల అనంతరం గురువారం రాత్రి అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. రాష్ట్రంలోని 27 జిల్లా పరిషత్‌లలో కూటమి పార్టీలు విజయం సాధించిన చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కూటమికే దక్కనున్నాయి. మొత్తం 27 జడ్పీ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి ఒకటి కేటాయించారు. అలాగే వైస్ ఛైర్మన్ పదవుల్లో టీడీపీకి 20, జనసేనకు 5, బీజేపీకి 2 స్థానాలు దక్కనున్నాయి.
జనసేనకు నాలుగు జడ్పీ ఛైర్మన్ పదవులు
పొత్తులో భాగంగా జనసేన పార్టీకి నాలుగు జిల్లాల జడ్పీ ఛైర్మన్ పదవులు కేటాయించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్థానాలను జనసేన దక్కించుకుంది. అదేవిధంగా ఐదు జిల్లాల జడ్పీ వైస్ ఛైర్మన్ పదవులు కూడా జనసేనకు కేటాయించారు. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల వైస్ ఛైర్మన్ పదవులను జనసేన అభ్యర్థులు చేపట్టనున్నారు.
Also Read
- Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
- YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
- AP Economic Regions: యువతకు లక్షలాది ఉద్యోగాలే లక్ష్యం.. మూడు ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
- Akvan Cyclone Alert: మళ్లీ ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుఫాన్..! మరో 36 గంటలు అలర్ట్
బీజేపీకి ఒక ఛైర్మన్, రెండు వైస్ ఛైర్మన్ పదవులు
కూటమిలో భాగంగా బీజేపీకి ఒక జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవితో పాటు రెండు వైస్ ఛైర్మన్ పదవులు కేటాయించారు. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించగా, ఎన్టీఆర్, తిరుపతి జిల్లాల జడ్పీ వైస్ ఛైర్మన్ పదవులు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి.
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్‌లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!