AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్‌.. పూర్తి వివరాలివే..!

Anil Chandra Punetha

Anil Chandra Punetha

AP MPTC, ZPTC Elections Rescheduled: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇక, అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్, అవసరమైన చోట రీపోలింగ్‌, ఓట్ల లెక్కింపును నిర్ణీత తేదీల్లో నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారైంది. ఎన్నికలకు సంబంధించిన తదుపరి ఏర్పాట్లను అధికారులు చేపట్టనున్నారు.

అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం 20.10.2026 నాటి నోటిఫికేషన్ ద్వారా గతంలోనే తీసుకున్న నిర్ణయం ప్రకారం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాలకు చెందిన 44 పోలింగ్ కేంద్రాలు, పోలవరం జిల్లాలోని 7 మండలాలకు చెందిన 44 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ముగింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు మార్చడం జరిగింది. కాబట్టి, ఈ మొత్తం 88 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ మరియు రీ-పోలింగ్ (ఏదైనా ఉంటే) మధ్యాహ్నం 3:00 గంటలకే ముగుస్తాయి. సవరించిన ఈ షెడ్యూల్ గురించి కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా..