Nara Lokesh meets Amit Shah: అమిత్ షాతో నారా లోకేష్ భేటీ
- ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఏపీ మంత్రి నారా లోకేష్..
- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ..
- 25 నిమిషాలకు పైగా పలు అంశాలపై సాగిన చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh meets Amit Shah: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇక, ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. 25 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అమిత్‌షాకు వివరించారు నారా లోకేష్.. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకుని.. విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు గారి సుదీర్ఘ పాలన అనుభవం ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు..
Read Also: West Bengal: నార్త్ బెంగాల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బంగ్లాదేశ్ చొరబాటు దారుడు..
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఇక, అంతకుముందు, భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు నారా లోకేష్.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాను. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరాను. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పగా, ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిని వివరించాను. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని నేను ఎంచుకున్నానని చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకుని పోరాడానని ధన్కర్ తెలిపారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేశాను అని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!