NTV Telugu Site icon

Nara Lokesh: పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం..

Lokesh

Lokesh

Nara Lokesh: విద్యా శాఖలో వచ్చే ఏడాది నుంచి, ప్రతి విద్యార్ధికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తాం. రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి నారా లోకేష్‌.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం 26 నవంబర్ 1949న వచ్చిందన్నారు.. రాజ్యాంగ రూపకర్తలను మనం స్మరించుకోవాలి.. హోం సెక్రెటరీ తప్ప మిగతా ఐపీఎస్ లు ఎవరూ లేరు ఈ సమావేశంలో… రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలి.. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా రాజ్యాంగ ప్రతిని అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తేవాలన్నారు.. Be the people of India కాదు.. Be the children of India.. పిల్లలే భారత భవిష్యత్తు అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..

Read Also: Pan Card 2.0 Use: QR కోడ్‌తో వస్తున్న కొత్త పాన్ కార్డ్.. ఫీచర్లు ఏంటంటే

ఇక, ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రపంచంలో నిలబెట్టింది మన రాజ్యాంగమే.. సమాన పనికి సమాన వేతనం, మహిళల పట్ల ప్రత్యేకత చూస్తే తెలుస్తుంది.. రాసే వారు ఎలా రాసినా… అమలు చేసే వారు సరిగా ఉండాలన్నారు.. మరోవైపు.. సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. 26 నవంబరు 1949 నరాజ్యాంగాన్ని ఆమోదించారు.. 1946లో బీఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ రచన ప్రారంభించారు.. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగ రచనకు.. మనది అతిపెద్ద రచనా రాజ్యాంగం అని గుర్తుచేశారు.. ఇక, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. 75వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.. సమగ్ర పరిష్కారంగా పనిచేసేలా రాజ్యాంగ రచన జరగడం విశేషంగా వెల్లడించారు.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం నడిపే విధానాలు ఇందులో ఉన్నాయన్నారు.. సున్నితమైన సునిశిత అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి అని వెల్లడించారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.