LPG Supply: గ్యాస్ సరఫరాపై మంత్రి టెలీకాన్ఫరెన్స్.. ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Supply: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
ఎక్కడి నుంచి సరఫరా?
రాష్ట్రానికి గ్యాస్ సరఫరా ప్రధానంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ విశాఖపట్నం నుంచి జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా Mangaluru నుంచి వచ్చే హస్సన్–చర్లపల్లి పైపులైన్ ద్వారా కూడా సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అలాగే Bharat Petroleum, Indian Oil Corporation సంస్థల ద్వారా రాష్ట్రానికి గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు మంత్రి నాదెండ్ల..
Also Read
- SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
- Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
- Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
- YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు
గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాల జాయింట్ కలెక్టర్లు గ్యాస్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే గ్యాస్ సరఫరాలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరోవైపు.. గ్యాస్ కొరతపై పుకార్లు సృష్టించి ధరలు పెంచినా, సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని సూచించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!