AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో గురువారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన నివేదికను ఏకసభ్య కమిషన్ హైకోర్టుకు సమర్పించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు పలు కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, అవసరమైన ప్రక్రియలు పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల నిర్ణయానికి కీలకమైన సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఏజీ కోర్టుకు వివరించారు. ఈ సర్వేకు సంబంధించిన డేటాను జూన్ 19 నుంచి రెండు రోజులపాటు గ్రామసభల ముందు ఉంచనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలను జూన్ 24 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ త్వరలోనే తన తుది నివేదికను సమర్పించనుందని ఏజీ పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని కోర్టుకు తెలియజేశారు.
Also Read
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు, తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల ఖరారు, సమగ్ర కుటుంబ సర్వే అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!