ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మంత్రి రామానాయుడు అన్నారు. అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యానికి జగన్ కూడా కారణం అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే నివృత్తి చేస్తామని తెలిపారు. వృధాగా పోయే నీటిని బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రా, తెలంగాణ జలాల పంపిణీపై రివ్యూ చేసి. రీ ఆర్డర్ అధికారం తెచ్చింది.. అంగీకరించింది 2023లో జగన్ హయాంలోనే జరిగింది అన్నారు.
ఇది కూడా చదవండి: SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!
విభజన చట్టం సెక్షన్ -3 ప్రకారం జలాల పంపిణీపై 2023 లో ఆర్డర్ ఇస్తే.. 30 మంది ఎంపీలు ఉన్న జగన్ ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం, కేసుల కోసం, బెయిల్ కోసం, గోదావరి, కృష్ణా జలాల హక్కులను సైతం వదులుకున్న జగన్‌ను రైతులు క్షమించరన్నారు. 18 నెలలు శ్రమించి నిర్మాణం పూర్తి చేసిన డయాఫ్రమ్ వాల్‌ను ధ్వంసం చేసింది జగనే అన్నారు. ‘‘పోలవరం ఫేజ్-1 , ఫేజ్-2 అని తెచ్చి ద్రోహం చేసింది జగనే. పోలవరం నీటి నిల్వ సామర్థ్యం, ఎత్తు 41.15 మీటర్లు, 45.72 మీటర్లు అంటూ విభజించి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసింది జగన్ కాదా ?.’’ అని రామానాయుడు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: SS Thaman: ట్రోలర్స్ ను చూస్తుంటే సిగ్గుగా ఉంది!