NTV Telugu Site icon

Jethwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Ap High Court

Ap High Court

Jethwani Case: సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ.. అయితే, విచారణలో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి.. ఇప్పటి వరకు ఈ కేసులో A2గా ఉన్న ఐపీఎస్‌ అధికారి సీతారామాంజ నేయులను ఎందుకు అరెస్ట్ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు.. అంతేకాదు.. సీతారామాంజనేయులు ఇప్పటి వరకు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు కదా? అని పీపీని ప్రశ్నించారు న్యాయమూర్తి..

Read Also: Honeymoon: హనీమూన్‌పై వివాదం.. అల్లుడిపై మామ యాసిడ్ దాడి..

కాగా, ముంబై నటి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. ఇక, ఈ కేసులో నిందితులుగా ఉన్న కాంతిరాణా, విశాల్‌గున్నీ, న్యాయవాది, ఏసీపీ, సీఐలు ముందస్తు బెయిల్‌ కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కానీ, ఏ2గా ఉన్న సీతారామాంజనేయులు మాత్రం ఇప్పటి వరకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది.. ఈ నేపథ్యంలో ఎందుకు అరెస్టు చేయలేదని కూడా న్యాయమూర్తి ప్రశ్నించారు. జత్వానీ కేసులో వాదనలు విన్న హైకోర్టు.. ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేసింది..

Show comments