NTV Telugu Site icon

Kadambari Jatwani Case: ముంబై నటి జత్వానీ కేసు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..

Kadambari Jatwani Case

Kadambari Jatwani Case

Kadambari Jatwani Case: సంచలనం సృష్టించిన ముంబై సినీనటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట దక్కింది.. ఈ కేసులో ఐపీఎస్‌ అధికారులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. కాగా, జత్వానీ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ హనుమంత రావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ వెంకటేశ్వర్లు.. ఈ కేసులో వాదనలు విన్న హైకోర్టు.. ఐపీఎస్‌ ఆఫీసర్స్‌తో పాటు పోలీసులు అధికారులకు ఊరట కల్పిస్తూ.. కొన్ని షరతులు విధిస్తూ.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.. కాగా, గత ప్రభుత్వంలో తనను వేధింపులకు గురిచేశారంటూ.. కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు నటి జత్వానీ.. ఆ తర్వాత కేసు నమోదు చేయడం.. ఈ వ్యవహారంలో కలగజేసుకున్నారన్న అభియోగాలతో ఐపీఎస్ అధికారులు సహా.. పలువురు పోలీసు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషం విదితమే..

Read Also: Formula E Car Race Case : కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ.. దూకుడు పెంచిన ఏసీబీ

Show comments