AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు.. పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.. ఈ విషయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం.. అయితే, కింది కోర్టులో పీపీలు, ఏపీపీలతోపాటు మరికొన్ని పోస్టుల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు..
Read Also: Vallabhaneni Vamsi Case: హైకోర్టులో వల్లభనేని వంశీ భార్య పిటిషన్.. ఆ సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలి..!
మరోవైపు.. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది.. బోర్డు సభ్యులను నిబంధనల ప్రకారం నియమించాలని, వెంటనే రద్దు చేయాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్.. అయితే, ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామక నోట్ ఫైళ్లను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు..