Site icon NTV Telugu

RGV: దర్శకుడు ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ కొట్టివేత..

Rgv

Rgv

RGV: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌ హై కోర్టులో చుక్కెదురైంది.. రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చే శారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది..

Read Also: Ram Charan : నేడు కడపకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

అయితే, రేపు విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు.. ఇక, సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరి చేలా పోస్టులు పెట్టారని రాంగోపాల్ వర్మపై అభియోగాలున్నాయి.. ఆ అభ్యంతరకర పోస్ట్ లు వర్మ పెట్టారని టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఆ కేసు విషయంలో ఆర్జీవీ హైకోర్టు మెట్లు ఎక్కగా.. హైకోర్టులో ఆర్జీవీకి చుక్కెదురైంది..

Exit mobile version