SIT On Liquor Sales: గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని ఆరోపణలు గుప్పిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఆయ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబును నియమించారు. సీఐడీ డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. సిట్ దర్యాప్తునకు అన్ని రకాల అధికారాలు కల్పించింది. మద్యం అక్రమాలకు సంబంధించి రికార్డులు సీజ్ చేసే అధికారం కూడా ఇచ్చింది ఏపీ సర్కార్.
Read Also: Mahesh Babu: ఏకంగా మహేష్ బాబు పేరుతో దొంగ ఓటు?
సిట్ చీఫ్‌గా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును నియమించిన ప్రభుత్వం.. మరో ఆరుగురు అధికారులను సిట్ టీమ్‌లో చేర్చింది.. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధక దళం ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు.., అడిషనల్ ఎస్పీ ఆర్వీవీఈ ఒంగోలు కొల్లి శ్రీనివాస్.., సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీహరి బాబు.., డోన్ డీఎస్పీ పి శ్రీనివాస్.., ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే శివాజీ.., ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీహెచ్ నాగ శ్రీనివాస్‌లతో సిట్ ఏర్పాటు అయ్యింది.. సీఐడీ డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పని చేస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం.. కాగా, గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తున్న కూటమి నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో సిట్ ను ఏర్పాటు చేయడం చర్చగా మారింది.