Land Registration Values: భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జనవరి 1వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయనే ప్రచారం జరిగింది.. దాంతో.. డిసెంబర్ చివరి వారంలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి.. అయితే, దీనిపై కసరత్తు సాగుతోందిని.. ఇప్పుడే కాదంటూ ప్రభుత్వం అప్పడు క్లారిటీ ఇచ్చింది.. అయితే, మరోసారి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంపై కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం.. వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందట.. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందట.. అయితే, అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట..
Read Also: World Economic Forum: దావోస్ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్..
భూముల మార్కెట్ విలువ, బుక్ విలువ మధ్య బాగా ఎక్కువ తేడా గుర్తించింది ప్రభుత్వం.. బుక్ విలువ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు నిర్ణయించాలనే ఆలోచలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది.. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్, ఇతర డెవలప్‌మెంట్ అవసరాల కోసం నిబంధనలు మరింత సులభతరం చేయనుంది ప్రభుత్వం.. వచ్చే నెల 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. రిజిస్ట్రేషన్ పెంపు అంశంపై త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఒకవేళ పూర్తి కసరత్తు జరగకపోతే మరి కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది.