Site icon NTV Telugu

Banakacherla Project: బనకచర్లపై కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

Banakacherla

Banakacherla

Banakacherla Project: బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్ర జలసంఘం అభ్యంతరాలపై దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కేంద్ర అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం.. ఏపీ ఇరిగేషన్ సలహదారు అధికారులతో సమావేశం అయ్యారు.. అయితే, కేంద్ర జలసంఘం.. అడిగిన లెక్కలుపై చర్చ సాగుతోంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్.. నీటి లెక్కలపై అధ్యయనం చేస్తోంది.. ఎల్లుండికి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు ఇరిగేషన్ అధికారులు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘంతో సమావేశం కానున్నారు ఏపీ అధికారులు..

Read Also: Drone Camera: ఫ్లైఓవర్‌పై ఫొటోషూట్.. యువకులను పట్టించిన డ్రోన్‌ కెమెరా..!

కాగా, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర వివాదంగా మారింది.. ఎలాగైనా బనకచర్లను అడ్డుకుంటామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. మిగులు జలాలనేకదా? మేం వాడుకునేది.. అభ్యంతరాలు ఎందుకంటూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నించింది.. అయితే, దీనిపై కేంద్ర మంత్రులను కలిసి ఫిర్యాదులు కూడా చేశారు తెలంగాణ సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిక కేంద్ర సర్కార్‌ షాక్‌ ఇచ్చింది.. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను వెనక్కి పంపింది కేంద్రం.. పర్యావరణ అనుమతులు తిరస్కరించింది.. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సీడబ్ల్యూసీ పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.. గోదావరి నది జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డ్ లు దీని పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది.. ఈ ప్రాజెక్టుపై అనేక విధాలుగా ఫిర్యాదులు వచ్చయన్న కమిటీ.. గోదావరి నది జాలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ అవార్డును ఉల్లంఘించినట్లు అవుతుందని ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది..

Exit mobile version