Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Vasamsetti Subhash: రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ప్రత్యేకంగా “లేబర్ అడ్డాలు” ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆధునిక సౌకర్యాలతో కార్మికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా ఈ లేబర్ అడ్డాలను రూపొందిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కేంద్రాలను విస్తరిస్తామని వెల్లడించారు. కార్మికులకు నీడ, తాగునీరు, వాష్‌రూమ్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.
ఉపాధి అవకాశాలను పెంచేందుకు కొత్త సాంకేతిక పరికరాల వినియోగంపై శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఒక రోజు పని దొరకని కార్మికులను పెద్ద నిర్మాణ ప్రాజెక్టులు, నైపుణ్యాధారిత ఉపాధి కేంద్రాలకు తీసుకెళ్లి వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీంతో కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు, అన్నా క్యాంటీన్లతో ఈ లేబర్ అడ్డాలను అనుసంధానం చేసి కార్మికులకు తక్కువ ధరలో ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసి, లేబర్ అడ్డాలను నోడల్ పాయింట్లుగా మార్చే ప్రణాళిక ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు.
Also Read
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్‌లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్
తాజావార్తలు
-
Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
-
Stock Market: యుద్ధం ముగింపు వార్తలతో.. భారీ లాభాల్లోకి వెళ్లిన స్టాక్ మార్కెట్లు..
-
India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
-
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్‌కు ముగింపు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!