Plastic Ban: పాస్టిక్ నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయంలో ఈనెల 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నాం అన్నారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమే ప్రభుత్వం లక్ష్యం అన్నారు. దశల వారీగా అన్ని మున్సిపాల్టీలు, నగరాల్లో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి తెస్తాం అన్నారు సురేష్ కుమార్. ప్లాస్టిక్ వల్లే మనుషుల్లో కాన్సర్ వచ్చేందుకు కారణమవుతోందని.. ప్లాస్టిక్ నీటివనరుల్లో కలసి మానవ మనుగడకు ప్రమాదకరమవుతోందన్నారు సురేష్ కుమార్.. రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్‌ను ఉచితంగా అందిస్తాం అన్నారు. సచివాలయంలో ప్రతి బ్లాక్‌లో RO ప్లాంట్, స్టెరిలైజేషన్ యూనిట్ ను ఏర్పాటు చేస్తాం అన్నారు. సచివాలయానికి బయటి నుంచి ఎవరూ ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురాకూడదన్నారు సురేష్ కుమార్.. ఎవరైనా ప్లాసిక్ బాటిళ్లు తీసుకు వస్తే గేటు వద్ద చెకింగ్ చేసి తీసేస్తాం అన్నారు.. సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై ఉద్యోగులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
Read Also: Prajwal Revanna: లైంగిక దాడి కేసులో కీలక తీర్పు.. ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు
మొత్తంగా ప్లాస్టిక్ నిషేదంలో భాగంగా మొదటి అడుగు పడినట్టు అయ్యింది.. రాష్ట్ర సచివాలయం నుంచి ప్లాస్టిక్ ఫ్రీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 15 నుంచి సెక్రటేరియట్ లో ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధం విధించింది.. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్రీ పై దృష్టి పెట్టాం.. జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి లో ప్రోగ్రాం మొదలు పెట్టాం.. సచివాలయం నుంచి ప్లాస్టిక్ ఫ్రీ కార్యక్రమం మొదలు అవుతుంది. జీఏడీ, సీఆర్డీఏ, మెప్మా.. ఇలా సమన్వయం చేసుకుంటూ ప్లాస్టిక్ ఫ్రీ పై అవగాహన కల్పిస్తున్నాం అన్నారు స్వచ్ఛాంధ్ర ఎంపీ అనిల్ కుమార్ రెడ్డి..
