NTV Telugu Site icon

Andhra Pradesh: భూ సంస్కరణలు.. అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసిన సర్కార్

Ap Govt

Ap Govt

Andhra Pradesh: భూ సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి చైర్మన్ గా.. జిల్లా మంత్రి.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. జాయింట్ కలెక్టర్.. ఆర్జీవో సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ఇక, ఈ అసైన్మెంట్‌ కమిటీల్లో ప్రత్యేక ఆహ్వానితుడుగా ఆ ప్రాంత ఎమ్మెల్సీ కూడా ఉండనున్నారు.. ప్రభుత్వ భూమిని గుర్తించడం.. పేదలకు భూమి ఇవ్వడం.. ఆయా జిల్లాలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం అసైన్మెంట్‌ కమిటీల ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్‌.. అసైన్మెంట్ కమిటీల ఏర్పాటుతో భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది.. కాగా, గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి.. అవకతవకలు జరిగాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఈ అంశాలను ప్రస్తావించిన విషయం విదితమే..

Read Also: Viral Video: డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్.. యూట్యూబర్కు ఇచ్చిపడేసిన ఆటోవాలా!