Site icon NTV Telugu

AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం… ఇక అర్చకులకే అంతా..!

Ap Government

Ap Government

AP Government: దేవాలయాల్లో పూజలు సహా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఆయా దేవాలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. దేవదాయ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.. అర్చకులకు విస్తృతాధికారులు కట్టబెట్టిన ప్రభుత్వం. పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.. ఆయా దేవాలయాల ఆగమం ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది ప్రభుత్వం.. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని జీవోలు వెల్లడించింది.. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని జీవోలో వెల్లడించింది.. ఆయా దేవాలయాల ఆగమ శాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Exit mobile version