దేవాలయాల్లో పూజలు సహా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఆయా దేవాలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. దేవదాయ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.