NTV Telugu Site icon

AP Government: వారికి గుడ్‌న్యూస్‌.. రూ.6,700 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..

Ap Govt

Ap Govt

AP Government: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి వివిధ వర్గాలకు రావాల్సిన బిల్లులకు సంబంధించి కొంతకాలంగా ఒత్తిడి వస్తోంది.. ప‌లు వ‌ర్గాల‌కు గ‌త కొంత కాలంలో పెండింగ్ లో ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన బాకాయిల‌ను రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయ‌డం ప్రారంభించింది.. .దాదాపు 8 ఏళ్లుగా కూడా కొన్ని బిల్లులు చెల్లింపులు జ‌గ‌న్ స‌ర్కార్ పెండింగ్ లో పెట్టింది.. అలా పెండింగ్ లో ఉన్న బిల్లుల్లో 6,700 కోట్లు రుపాయిలు నిధులు విడుద‌ల చేశారు.. ఇందులో ప‌ది లక్షల లోపు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, పోలీసుల స‌రెండ‌ర్ లీవులు, విద్యార్దుల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ లాంటివి ఉన్నాయి.. గ‌త జ‌గ‌న్ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు ల‌క్షా 20 వేల కోట్లు రుపాయిలు పెండింగ్ లో పెట్టింది.. 2014 – 19 మ‌ధ్యలో టీడీపీ పాల‌న‌లో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పటి వ‌ర‌కు చెల్లించ‌లేదు.. అందులో చిన్ని చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప‌రిశ్రమల‌కు చెల్లింపులు , విద్యార్ధుల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ ఇలా అనేక మైన బిల్లులు పెండింగ్ లో పెట్టింది జ‌గ‌న్ స‌ర్కార్.. అయితే రాష్ట్రంలో చంద్రబాబు స‌ర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కుట‌మి స‌ర్కార్ కు పెండింగ్ బిల్లు చాలా పెను భారంగా మారింది.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది.. దీనికి తోడు పెండింగ్ బిల్లులు చెల్లింపులు భారంగా మారింది.

Read Also: Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)

అయితే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసిన పెండింగ్ బిల్లుల్లో.. పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెండింగ్ బిల్లులు ఉన్నాయి.. ఉద్యోగుల జీపీఎఫ్ 519 కోట్లు నిధులు నేడు విడుద‌ల చేశారు.. పోలీసుల రెండు సరెండర్ లీవుల‌కు గాను.. ఒక ఇన్స్టాల్ మెంట్ బ‌కాయి కింద‌ 213 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేశారు.. మ‌రో వైపు సీపీయ‌స్ కింద‌ 300 కోట్లు నిధులు విడుదల చేయ‌గా. టీడీఎస్‌ కింద 265 కోట్లు చెల్లింపులు చేసింది ఆర్ధిక శాఖ‌.. మొత్తంగా ఉద్యోగులకు 1300 కోట్లు పెండింగ్ బిల్లులుకు నిధులు విడుదల చేశారు.. ఇదే క్రమంలో సుమారు 6.5 లక్షల మంది విద్యార్ధులకు గ‌త ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబ‌ర్స్ మెంట్ నిధులు 788 కోట్లు రుపాయిలు జ‌మ కానున్నాయి..

Read Also: Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)

స‌హ‌జంగా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ప‌నులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు చేయ‌డం అనేది ప్రభుత్వం భాద్యత‌.. గ‌త ఐదేళ్ల పాటు చెల్లించ‌కుండా వేల కోట్లు పెండింగ్ ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఇక, వాటిని ఇవాళ చెల్లిస్తున్న బిల్లులలో చిన్న, చిన్న ప్రభుత్వ కాంట్రాక్టు ప‌నులు చేసిన 26 వేల మందికి 10 లక్షల లోపు బిల్లులవి 586 కోట్లు నిధులు విడుదల చేశారు.. ఇదే క్రమంలో 650 చిన్న కంపెనీల‌కు గాను ప్రభుత్వ రాయితీలు కింద 90 కోట్లు విడుద‌ల చేశారు.. రాష్ట్ర ప్రభుత్వ వివిధ వ‌ర్గాల‌కు ఇచ్చే విద్యుత్ స‌బ్సిడీ కింద 500 కోట్లు విడుదల చేశారు.. ఆరోగ్య శ్రీ బ‌కాయిలు దాదాపు 3 వేల కోట్లు పెండింగ్ పెట్టింది.. దీనిలో విడ‌త‌ల వారికి ఇప్పటికే కొన్ని చెల్లింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కు 400 కోట్లు చెల్లింపు చేసింది.. అమ‌రావ‌తి.. రైతులకు ఇచ్చే ఏడాది కౌలు పెండింగ్ బకాయిల‌ను 241 కోట్లు రుపాయిల‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ సాయంత్రం లోగా 6700 కోట్లు రుపాయిలు పెండింగ్ బిల్లులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ కానున్నాయి..

Show comments