AP Govt: ఫీజు రియంబర్స్ మెంట్ కోసం 600 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రియంబర్స్ మెంట్ కు సుమారు రూ. 788 కోట్లు చెల్లించామని సర్కార్ పేర్కొన్నారు. త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఇక, దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దని వెల్లడించింది. విద్యార్థులను ఇబ్బంది పెడితే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
AP Govt: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్..
- ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ. 600 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కార్..
- 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేశామన్న ఉన్నత విద్యాశాఖ..
- త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామన్న విద్యాశాఖ కార్యదర్శి శశిధర్..

Ap Govt