NTV Telugu Site icon

AP Pension Distribution: పెన్షన్ల పంపిణీకి గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన సర్కార్.. ఒకేరోజు పూర్తిచేయాలి..!

Pension

Pension

AP Pension Distribution: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సిద్ధం అవుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లలు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసింది.. అది కూడా అప్పటి వరకు ఉన్న వాలంటీర్‌ వ్యవస్థ సపోర్ట్‌ లేకుండానే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసింది చంద్రబాబు సర్కార్‌.. ఇక, జులై నెల ముగింపునకు వచ్చింది.. దాంతో ఆగస్టు 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి రెడీ అవుతోంది.. పింఛన్ల లబ్ధిదారులకు ఒక్కరోజులోనే పంపిణీ పూర్తి చేయాలని గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ సర్కార్‌..

Read Also: Rohan Bopanna Retirement: భారత జెర్సీలో చివరి మ్యాచ్‌ ఆడేశా: రోహన్‌ బోపన్న

పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. పెన్షన్ పంపిణీ రోజే.. ఆగస్టు 1వ తేదీనే దాదాపు 99 శాతం పంపిణీని పూర్తి చేయాల్సి ఉంటుందంటూ ఆదేశాలు జారీ చేసింది.. అయితే, సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేసింది.. ఇక, గత నెలలో మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్‌తో కలిసి.. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈసారి.. అంటే ఆగష్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.