AP Government: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. బిజినెస్ రూల్స్ మార్పులకు సీఎం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: పాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని బిజినెస్ రూల్స్‌ను మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ వ్యవస్థలో కొనసాగుతున్న రొటీన్ విధానాలకు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించిన ఆయన.. కాలానుగుణంగా పరిపాలనా విధానాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ఆర్టిజీఎస్ విభాగానికి అన్ని శాఖల సమాచారం సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం బలోపేతం కావాలంటే డేటా షేరింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దీనికోసం ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ప్రత్యేకంగా ఒక అధికారిని కేటాయించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఆయా శాఖల సమాచారం నిరంతరం ఆర్టిజీఎస్కు చేరేలా ఈ అధికారులు సమన్వయం చేయనున్నారు. ఈ మార్పులతో ప్రభుత్వ నిర్ణయాలు మరింత వేగంగా అమలవడంతో పాటు పరిపాలనలో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్‌దే.. కఠిన చర్యలకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!