Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగుల నియామకంపై విధివిధానాలు జారీ చేసింది… ఇతర శాఖల నుంచి ఎక్కువ మంది మున్సిపల్ శాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలు నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసింది.. పంచాయతీ రాజ్, రెవెన్యూ, స్టేట్ ఆడిట్, సెక్రటేరియట్ శాఖల నుంచి మాత్రమే మున్సిపల్ శాఖకు అనుమతి ఇస్తారు. ఇక, మాతృ శాఖలో ఐదేళ్లు సర్వీస్ తో పాటు బ్యాచిలర్ డిగ్రీ, అకౌంట్ టెస్ట్ లు పాస్, విజిలెన్స్ కేసులు లేకుండా ఉన్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది. ఆయా శాఖల్లో పొందుతున్న జీతం ఆధారంగా మున్సిపాలిటీ పోస్టులకు అర్హత ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్న కమిషనర్, అడిషనల్ కమిషనర్ పోస్టుల్లో గరిష్టంగా 10 శాతం మాత్రమే ఇతర శాఖల వారితో భర్తీ చేస్తారు. మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లుగా నియమించబడిన వారికి నెల రోజుల పాటు ట్రైనింగ్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖల నుంచి వచ్చిన వారిని ఏ సమయంలోనైనా మాతృ శాఖకు పంపించే లా నిబంధన విధించింది ఏపీ ప్రభుత్వం..
Read Also: Genelia : ‘జూనియర్’ అద్భుతమైన ప్యాకేజ్.. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశా!
