NTV Telugu Site icon

AP Government: మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డి సహా నలుగురు ఐఏఎస్‌లను రిలీవ్ చేసిన సర్కార్‌.. ఉత్తర్వులు జారీ

Ap Cs

Ap Cs

AP Government: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డి సహా.. నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను రిలీవ్‌ చేసింది.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.. అయితే, ఈ నెల 30వ తేదీన నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రిటైర్ కానున్నారు.. వారిలో జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్య, వెంకట రమణా రెడ్డి, అరుణ్ కుమార్‌ ఉన్నారు.. దీంతో.. ఈ నెల 30వ తేదీన రిటైర్ కానున్న నలుగురు ఐఏఎస్‌ అధికారులను రిలీవ్ చేస్తున్నట్టు సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: Darshan: దర్శన్ కు మద్దతు పలికిన నటికి అభిమానుల టార్చర్.. చెప్పుకోలేనంత అసభ్యంగా!

కాగా, గత ప్రభుత్వంలో సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించి.. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డితో పాటు.. మరో సీనియర్‌ ఐఏఎస్‌ పూనమ్ మాలకొండయ్యకు ఈ రోజే పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డికి.. సాధారణ పరిపాలన శాఖలో జీపీఏం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనమ్ మాలకొండయ్యకి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం విదితమే.. ఈ నెల 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న ఇద్దరు సీనియర్‌ అధికారులకు మూడు రోజుల ముందే పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.. మరోవైపు ఈ రోజే వారిని రిలీవ్‌ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు.