NTV Telugu Site icon

AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఆ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత..

Ap Govt

Ap Govt

AP Government: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. చట్ట విరుద్ధంగా జరిగిన ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చెయ్యాల్సిన డాక్యుమెంట్లను తహసీల్దార్.. ఆయా సబ్ రిజిస్టర్లకు పంపిస్తారు అని వెల్లడించారు.. ఇటీవల కాలంలో ప్రభుత్వ భూములు తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అనగాని.. దీంతో, తహసీల్దార్లకు చట్ట విరుద్ధ రిజిస్ట్రేషన్ రద్దు బాధ్యతలు అప్పగించామన్నారు.

Read Also: Mani Shankar Aiyar: రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..

ఇప్పటి వరకు కలెక్టర్ల వద్దనే ఈ అధికారం ఉండగా.. ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ భూముల చట్టవిరుద్ద రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం తహశీల్దార్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ భూములతోపాటు చట్టప్రకారం రిజిస్ర్టేషన్ చేయకూడని ఏ భూమినైనా రిజిస్ట్రర్‌ చేస్తే ఆ డాక్యుమెంట్ ను రద్దు చేసే అధికారం తహసీల్దార్లకు ఇస్తున్నాం అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. రద్దు చేయాల్సిన రిజిస్టర్డ్ డాక్యమెంట్లను సబ్ రిజిస్ర్టార్ కు తహసీల్దార్ పంపిస్తారని.. డాక్యుమెంట్ రద్దుకు చేయాల్సిన ప్రక్రియ పూర్తి చేసి తాహసీల్దార్ సూచించిన వ్యక్తలకు రిజిస్ట్రార్‌ పంపుతారని వెల్లడించారు..