Site icon NTV Telugu

Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్..

Ap Govt

Ap Govt

Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలం ముగిసిపోగా.. వారి సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఆర్థిక శాఖ అనుమతితో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే సేవల పొడిగింపు వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయుష్ కుమార్.. ఇక, కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకానికి ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కాగా, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో పాటు.. జిల్లాల్లో వందలాది మంద్రి కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న విషయం విదితమే..

Read Also: Deputy CM Pawan Kalyan: గొప్ప మనసు చాటుకున్న పవన్‌.. ఉగ్రదాడి అమరుని కుటుంబానికి రూ.50 లక్షల విరాళం..

Exit mobile version