NTV Telugu Site icon

AP Government: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో భారీగా బదిలీలు.. మార్గదర్శకాలపై రెడీ..!

Ap

Ap

AP Government: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో బదిలీలు చేపట్టనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇక, బదిలీల మార్గదర్శకాలపై తుది కసరత్తు జరుగుతోంది.. ఆఫీస్ బేరర్ల పేరుతో బదిలీలను తప్పించుకునేలా కొందరు వైసీపీ అనుకూల ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.. ఆఫీస్ బేరర్లకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి వెసులుబాటు కల్పించే జీవోను అడ్డం పెట్టుకుంటున్నారట పలువురు ఉద్యోగులు. అయితే, ఉద్యోగ సంఘాలిచ్చే ఆఫీస్ బేరర్ల పేర్లతో ఇచ్చే లెటర్లను ఏ విధంగా కట్టడి చేయాలనే అంశంపై తర్జన భర్జన జరుగుతోందట.. ఆఫీస్ బేరర్ల లెటర్ల కోసం ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాలని ఆశ్రయిస్తున్నారు పలువురు వైసీపీ అనుకూల ఉద్యోగులు. ఐదేళ్ల నుంచి ఒకే చోట పాతుకుపోయి.. ఇప్పుడు ఆఫీస్ బేరర్ల లెటర్ల కోసం ఉద్యోగ సంఘాల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట..

Read Also: Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇట్స్ అఫీషియల్..

అయితే, సాధారణ ఉద్యోగుల బదిలీలకు ఇబ్బంది కలిగించేలా ఆఫీస్ బేరర్ల లెటర్లు మారతాయే ఆందోళన వ్యక్తం అవుతోంది.. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ఉన్నాయి.. ఆఫీస్ బేరర్ల లెటర్ల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు బదిలీలు తప్పించుకునే అవకాశం లేకపోలేదు.. మరోవైపు, సంఘాల్లో పని చేయని ఉద్యోగులకు సైతం ఆఫీస్ బేరర్ల లెటర్లు ఇచేస్తున్నాయట కొన్ని ఉద్యోగ సంఘాలు. ఆఫీస్ బేరర్లమంటూ ఉద్యోగులిచ్చే లెటర్లను స్క్రూట్నీ చేసే వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు.. ఆఫీస్ బేరర్ల లెటర్లను కట్టడి చేయకుంటే బదిలీల విషయంలో ప్రభుత్వ ఉద్దేశ్యాలు నెరవేరయని అంటున్నారు ఉద్యోగులు.