Site icon NTV Telugu

AP Best Legislator Award: ఇక, ఏపీలో ఉత్తమ లేజిస్లేటర్ అవార్డు..!

Ap Assembly

Ap Assembly

AP Best Legislator Award: పార్లమెంట్‌లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్‌ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు.. సభ్యుల పనితీరు, వారు అడుగుతున్న ప్రశ్నల తీరు.. సభలో వారి ప్రవర్తన ఆధారంగా ఈ అవార్డుకు సభ్యులను ఎంపిక చేయనున్నారు.. దీనిపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు..

Read Also: Health Tips: అలాంటి వ్యక్తులు నాన్ వెజ్ తినకూడదు.. తింటె ప్రమాదంలో పడ్డట్టే!

ఇటీవల స్పీకర్‌ చింతకాలయ అయ్యన్నపాత్రుడితో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాడు.. ఉత్తమ లేజిస్లేటర్‌ అవార్డుపై చర్చించారు.. గతంలో శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి ప్రవేశించినప్పుడు అప్పట్టి పరిస్థితులు ఎలా ఉండేవి? సభా సంప్రదాయాలకు ఎలా విలువనిచ్చేవారు? చర్చలు ఎలా జరిగేవి వంటివి గుర్తు చేసుకున్నారు.. అయితే, ఇప్పుడు కూడా సభలో చర్చల్లో ఇంకా నాణ్యత, సభ్యుల భాగస్వామ్యం పెరగాలని అభిప్రాయపడ్డారు.. అలా సభ ప్రజావాణిని వినిపించేందుకు వేదికగా నిలబడాలని స్పీకర్‌, సీఎం అభిప్రాయాలన్ని వ్యక్తం చేశారు.. అందులో భాగంగానే ఉత్తమ లెజిస్లేటర్‌ అవార్డు ఇస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారట.. ఉత్తమ లెజిస్లేటర్‌ ఎంపిక కోసం అసెంబ్లీలోనూ ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కూడా రాగా.. ఇప్పుడు కమిటీ ఎంపిక కోసం ముందడుగు వేస్తోంది ప్రభుత్వం..

Read Also: Health Tips: అలాంటి వ్యక్తులు నాన్ వెజ్ తినకూడదు.. తింటె ప్రమాదంలో పడ్డట్టే!

Exit mobile version