AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. నంద్యాల జిల్లాలో అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇచ్చిన పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును రద్దు చేసింది.. 800 మెగావాట్ల అవుకు పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన ప్రాజెక్టు కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. అయితే, డీపీఆర్ పూర్తిలో అసాధారణ జాప్యం, పేవలమైన పురోగతి కనపరచినందున ఈ కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్.. తదుపరి చర్యలు తీసుకోవాలని వైస్ చైర్మన్ & ఎండీ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP)కు ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్..
Read Also: Rajasthan: “ఖాకీల దౌర్జన్యం”.. పోలీసు దెబ్బకు స్పృహ కోల్పోయిన దుకాణదారుడు..(వీడియో)
