NTV Telugu Site icon

AP Incharge Ministers: జిల్లాలకు ఇంఛార్జ్‌ మంత్రుల నియామకం.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌కు నో ఛాన్స్..!

Cabinet

Cabinet

AP Incharge Ministers: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం జిల్లాలకు ఇంఛార్జ్‌ మంత్రులను నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార్‌.. అయితే, పలువురు మంత్రులను రెండేసి జిల్లాలకు ఇంఛార్జ్‌గా నియమించారు.. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, అనగాని సత్య ప్రసాద్ లాంటి వారికి రెండు జిల్లా బాధ్యతలు అప్పగించారు.. అచ్చెన్నాయుడుకు పార్వతీపురంమన్యం, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల ఇంఛార్జ్‌ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. నిమ్మలకు తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు.. గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యతలు.. అనగానికి శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతల అప్పగించింది..

Read Also: Dark Chocolate: అయ్య బాబోయ్.. డార్క్ చాక్లెట్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా

అయితే, జిల్లాలకు ఇంఛార్జ్‌ మంత్రులను నియమించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతలకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ను దూరం పెట్టింది.. పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌కు ఇంఛార్జ్‌ మంత్రుల బాధ్యతలు ఇవ్వకపోవడంతో నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించింది.. ఇక, జనసేన మంత్రులకు ఏలూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగించగా.. బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు అప్పజెప్పింది..

ఇక, జిల్లాల వారీగా మంత్రుల ఇంఛార్జ్‌ బాధ్యతలు పరిశీలిస్తే..

1. శ్రీకాకుళం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్..
2. పార్వతీపురం మన్యం -అచ్చెన్నాయుడు
3. విజయనగరం- వంగలపూడి అనిత
4. విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి
5. అల్లూరి సీతారామ రాజు- గుమ్మిడి సంధ్యారాణి..
6. అనకాపల్లి – కొల్లు రవీంద్ర
7. కాకినాడ-పొంగూరు నారాయణ
8. తూర్పు గోదావరి-నిమ్మల రామానాయుడు
9. బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ- అచ్చెన్నాయుడు
10. ఏలూరు – నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
11. పశ్చిమ గోదావరి- గొట్టిపాటి రవికుమార్‌
12. ఎన్టీఆర్‌ – సత్యకుమార్‌ యాదవ్
13. కృష్ణా-వాసంశెట్టి సుభాష్‌
14. పల్నాడు-గొట్టిపాటి రవికుమార్
15. గుంటూరు-కందుల దుర్గేష్ (జనసేన)
16. బాపట్ల-కొలుసు పార్థసారథి
17. ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి
18. నెల్లూరు – నస్యం మహమ్మద్‌ ఫరూఖ్‌
19. కర్నూలు-నిమ్మల రామానాయుడు
20. నంద్యాల – పయ్యావుల కేశవ్
21. అనంతపురం – టీజీ భరత్
22. శ్రీసత్యసాయి-అనగాని సత్యప్రసాద్
23. కడప-ఎస్. సవిత
24. అన్నమయ్య-బీసీ జనార్ధన్‌రెడ్డి
25. తిరుపతి-అనగాని సత్యప్రసాద్
26. చిత్తూరు-మందపల్లి రాంప్రసాద్‌రెడ్డి

Show comments