108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
108 Ambulances at District Courts: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టుల వద్ద అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లోని జిల్లా కోర్టుల వద్ద అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ALS) సౌకర్యం కలిగిన ‘108’ అంబులెన్సులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కోర్టు వద్ద ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 13 జిల్లా కోర్టుల వద్ద అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కలిగిన 108 అంబులెన్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవల నిర్వహణ కోసం ఏటా రూ.3.93 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక, అదనంగా, సీఆర్డీఏ పరిధిలోని రాయపూడి, ఐనవోలు, ఉండవల్లి ప్రాంతాల్లో కూడా మరో మూడు కొత్త 108 అంబులెన్సులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కోర్టులకు వచ్చే న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించే అవకాశం ఏర్పడనుంది.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్‌న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్‌న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
తాజావార్తలు
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్‌ఫేక్‌లపై శృతి హాసన్‌కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్‌లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!