Site icon NTV Telugu

Minister Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 సేవలు.. కార్యాచరణ సిద్ధం చేసిన ప్రభుత్వం..

Collectors Conference

Collectors Conference

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.. పౌర సేవల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా.. వారికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా.. వాట్సాప్‌ ద్వారానే ఏకంగా 153 సేవలను అందించేందుకు సిద్ధమైంది.. వాట్సాప్‌ ద్వారా పౌరసేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌.. వెబ్ సైట్ ద్వారా ఇక నుంచి ప్రభుత్వ సమాచారం వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆయన.. జనన, మరణ, ధృవీకరణ పత్రాల లాంటివి జారీ చేయటానికి అనుసరిస్తున్న విధానాన్ని రీఇంజనీరింగ్ చేయాల్సి ఉందన్నారు.. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీ సమయంలో ఎదురైన ఇబ్బందులను ప్రస్తుతం మార్పు చేసి సరి చేస్తున్నాం అని వివరించారు.. విధానాలను సగం నుంచి డిజిటలైజ్ చేయటం కాకుండా పూర్తిగా వాటి ప్రాసెస్ ను రీ-ఇంజనీరింగ్ చేయాల్సి ఉందన్నారు.. ప్రస్తుతం ప్రపంచంలో యూఏఈ మాత్రమే ఒకే ప్లాట్ ఫాంపై పౌర సేవలు అందిస్తోంది.. ప్రభుత్వ సమాచారం ఒకే చోట ఉండేలా apgov.in వెబ్ సైట్ లో పొందు పరుస్తాం.. ఇక, 153 పౌర సేవలు వాట్సప్ ద్వారా ఇచ్చేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేశామని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో వివరించారు మంత్రి నారా లోకేష్‌..

Read Also: YS Jagan: రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై స్పందించిన జగన్‌.. సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version