Site icon NTV Telugu

Nara Lokesh meet Jaishankar: డేటా సిటీ ఏర్పాటుకు సహకరించండి.. జైశంకర్‌ను కోరిన లోకేష్‌

Nara Lokesh Meet Jaishankar

Nara Lokesh Meet Jaishankar

Nara Lokesh meet Jaishankar: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు.. తన పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను కలిసిన లోకేష్.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం ఇతరదేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నంలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని చెప్పారు, దీనికి సహకారం కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలి, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ, అంతర్జాతీయస్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలకు నిరంతరం సహకారం అందించండి. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులతోపాటు నిధులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు.. వివిధ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి కి సింగపూర్ ప్రభుత్వం తో జరిగిన చర్చల గురించి లోకేష్ వివరించారు.

Read Also: Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్‌కట్

ఇక, ఏపీకి చెందిన సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారని తెలిపారు లోకేష్. అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపా దేశాల్లో 4లక్షలమంది ప్రవాసాంధ్రులు ఉన్నారు. యూఎస్ లో అక్కడ ప్రజల తలసరి ఆదాయం $70,000 డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం $1,26,000 డాలర్లుగా ఉంది. ఐరోపాదేశాలు, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ లతో మొబిలిటీ, మైగ్రేషన్ (MMPA) భాగస్వామ్యాలను ఏర్పాటుచేయడంలో కేంద్రచర్యలు అభినందనీయం. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ ను తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఆంధ్రప్రదేశ్ పూర్తి మద్దతునిస్తింది. కార్మికుల భద్రత, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడం, రాష్ట్రస్థాయిలో ఆయా ఒప్పందాలను అమలుచేయడంలో ఎపి ముందంజలో ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు.

Read Also: Ramantapur Incident Ex-Gratia: మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన!

స్కిల్ డెవలప్ మెంట్, ఇనిస్టిట్యూషనల్ పార్టనర్ షిప్స్ కోసం నైపుణ్య భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంలో ఎపి ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని… ఇందులో రష్యా, ఆస్టేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ ఎసెస్ మెంట్ పై ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం అన్నారు లోకేష్. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్యం పోర్టల్ ను త్వరలో ప్రారంభించబోతున్నాం. నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్జానాన్ని రప్పించడానికి జపాన్, కొరియా, తైవాన్లతో కలసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్ మెంట్ (MMPA) ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టిసారించాం. ప్రపంచ డయాస్పోరా వేదికగా ఐటి, సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత విద్య రంగంలో పెట్టుబడులు, నాలెడ్జి ట్రాన్సఫర్ కోసం ఎపి ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు డాటా షేరింగ్ సహకారాన్ని అందించాల్సిందిగా కేంద్రమంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్..

Exit mobile version