NTV Telugu Site icon

Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఫైల్స్‌ దగ్ధం కేసులో కీలక పరిణామం..

Madanapalle Sub Collector

Madanapalle Sub Collector

Madanapalle Sub Collector Office incident: మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో ఫైల్స్‌ దగ్ధం కేసు సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ సర్కార్‌.. అంతేకాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ కేసుపై రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు.. ఇక, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఫైల్స్‌ దగ్ధం కేసును సీఐడీకి అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. రెండు రోజుల్లో కేసు ఫైల్‌ను సీఐడీకి అప్పగించనున్నారు పోలీసులు. గత నెల 21వ తేదీ రాత్రి సబ్‌కలెక్టరేట్‌లో రెవెన్యూ దస్త్రాలు దహనమయ్యాయి. ఈ ఘటనలో 9 కేసులు నమోదు చేశారు మదనపల్లె పోలీసులు. పలువురు ఉద్యోగులు, నాయకులపై కూడా కేసులు నమోదు చేశారు. ఇకపై… ఈ కేసును లోతుగా విచారణ చేయాలన్న ఉద్దేశంతో.. సీఐడీకి అప్పగించారు.. దీంతో.. ఈ కేసులో లోతుగా విచారణ సాగనుండగా.. ఎలాంటి పరిణామాలు వెలుగు చూస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: Fraud Case: వీడు మాములోడు కాదు.. 22 ఏళ్లుగా బ్యాంకు అధికారులకు పంగనామాలు

Show comments