NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్‌ కల్యాణ్‌.. రెండు రోజుల షెడ్యుల్‌ ఇదే..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు పవన్‌.. మొత్తంగా మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏపీ డిప్యుటీ సీఎం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్‌ కల్యాణ్‌..

Read Also: IIT Madras : ఐఐటి మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

* 16న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ షెడ్యూల్
– నాందేడ్ జిల్లా డెగ్లూర్ లో బహిరంగ సభలో పాల్గొననున్న పవన్‌..
* భోకర్, లాతూర్‌లలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు
* షోలాపూర్ లో రోడ్ షో నిర్వహించనున్న ఏపీ డిప్యూటీ సీఎం..

* 17న డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్‌ షెడ్యూల్
* చంద్రపూర్ జిల్లా బల్లార్‌పూర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు..
* సాయంత్రం పూణె కంటోన్మెంట్ లో రోడ్ షో నిర్వహిస్తారు..
* కస్భాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న పవన్‌ కల్యాణ్‌..

Rea Also: Jhansi Medical College : ఝాన్సీ మెడికల్ కాలేజీలో ఘోర ప్రమాదం.. 10 మంది పిల్లలు సజీవదహనం.. అసలేమైందంటే ?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని.. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న ఆయన.. ఐదు బహిరంగ సభలు.. రెండు రోడ్‌ షోలలో పాల్గొంటారని జనసేన ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా.. ఇతర రాష్ట్రాల్లోనూ అవసరాలను బట్టి ఏపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనబోతున్నారు.

Show comments