Pawan Kalyan Meets PM Modi: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ అంశాలపై చర్చించిన ఆయన.. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఇక, ఆ తర్వాత ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ (ఎక్స్‌లో పోస్టు) ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్.. ‘మోడీ నాపై చూపే అభిమానం.. ఆప్యాయత ఎంతో విలులైనది.. పార్లమెంటు సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించారు.. గాంధీనగర్‌లో మోడీతో నా తొలి సమావేశం నుంచి ఈ భేటీ వరకు, మోడీకి పని పట్ల నిబద్ధత, దేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: EAGLE: గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే.. ఈగల్‌గా మారిన ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్
ఇక, ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌ను.. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమైన ఆయన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడింది. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగడమే వాదనీయంగా ఉంది. ఏపీకి చెందిన రూ.110 కోట్లు విలువైన ఎర్రచందనం దుంగలు కర్ణాటకలో దొరికాయి, వాటిని ఆ రాష్ట్రం విక్రయించింది. అంతేకాకుండా, ఇవి విదేశాల్లో కూడా దొరికితే తిరిగి భారతదేశంలోకి రప్పించవచ్చు. కానీ, పొరుగు రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనాన్ని స్వరాష్ట్రానికి రప్పించడం సాధ్యమవుతుందా? ఈ అంశంపై నేను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో చర్చించాను. ఈ ఎర్రచందనం తిరిగి రాష్ట్రానికి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరాను.” అలాగే, అదానీ పవర్ ప్రాజెక్టు అంశం గురించి ఆయన వివరించవచ్చు, “ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగింది, దీనిపై పూర్తి అవగాహన అవసరం.” అన్నారు.. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను తీవ్రంగా ఖండించారు పవన్.. బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారత సైన్యం చేసిన త్యాగాలు మరువకూడదు. ఇక్కడ మైనార్టీలను ఎలా చూస్తున్నామో, అక్కడ మైనార్టీ హిందువులను ఎలా చూస్తున్నారు? పాలస్తీనాలో ఏదైనా జరిగినప్పుడు స్పందించే ప్రముఖులు, బంగ్లాదేశ్‌లో జరిగే ఈ దుర్ఘటనలపై ఎందుకు స్పందించరు? అని నిలదీశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
I am grateful to Hon PM. Shri @narendramodi Ji for giving his valuable time amidst hectic parliament sessions. From my first meeting in Gandhinagar till this meeting, it was always filled with warmth and I always leave the meeting with admiration for him and his commitment and… pic.twitter.com/mu9RtgcwPQ
— Pawan Kalyan (@PawanKalyan) November 27, 2024