Deputy CM Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..
- ప్రధాని మోడీపై విశ్వాసం మరోమారు రుజువైందన్న పవన్..
- 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచేలా పాలన సాగిస్తున్నారు..
- మోడీ లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది.. 70 స్థానాలున్న ఢిల్లీలో.. బీజేపీ 47 స్థానాల్లో విజయాన్ని అందుకోగా.. ఆప్ 23 స్థానాలకే పరిమితం అయ్యింది.. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతా కూడా తెరవలేదు.. ఇక, ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసం మరోమారు రుజువైందన్నారు.. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకంగా పేర్కొన్నారు..
Read Also: Nagachaitanya: నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగ చైతన్య..?
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ఈ తరుణంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం అన్నారు పవన్ కల్యాణ్.. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరతాయి. ఢిల్లీ అభివృద్ధికి, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. నరేంద్ర మోడీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారు. కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా.. దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొన్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారని పేర్కొన్నారు.. ఇక, ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ, దాని మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు